ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, యబట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 19 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,782 మంది భక్తులు దర్శించుకోగా, 30,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చింది.