Trending Now

ఐఎన్ ఐఎస్ఎస్ పరీక్షలో జాతీయ స్థాయిలో రెండవ స్థానం.. సన్మానించిన ఎమ్మెల్యే

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జాతీయస్థాయిలో స్పెషలైజేషన్ కోసం నిర్వహించే ఐఎన్ ఐఎస్‌ఎస్ (ఇనిస్ట్యూట్ ఆఫ్ నేషనల్ ఇమ్పార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలో నియోజకవర్గంలోని కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన మౌనిక రెండవ స్థానాన్ని సాధించారు. మౌనిక తండ్రి మహా లింగం ఆర్టీసీ సంస్థలో షాద్ నగర్ డిపోలో కండాక్టర్ గా పని చేస్తున్నారు. షాద్ నగర్ పట్టణంలో పదవ తరగతి చదివిన మౌనిక 9.7 జీపీఏ మార్కులు సాధించింది. ఆ తరువాత ఇంటర్ లో 985 మార్కులు సాధించడమే కాకుండా ఎంసెట్లో 447 వ ర్యాంక్ ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

ఆ తర్వాత ఎయిమ్స్ లో పీజీ సీటు సాధించి సీనియర్ రెసిడెంట్ గా పనిచేశారు. అంకాలజీ విభాగంలో స్పెషలైజేషన్ పూర్తి చేసి పేదవారికి వైద్య సహాయం అందిస్తానని మౌనిక తెలిపారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మౌనిక సాధించిన ఘనత ను మెచ్చుకొని గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మౌనిక కు రూ. 50,000 పారితోషికం అందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్, ఇబ్రహీం, రఘు నాయక్, నరేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News