ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం జి. చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు. గతంలో చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో జరిగిన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు.