Trending Now

కాంగ్రెస్‌లోకి మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ గూటిలోకి మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరారు. ఇప్పటికే పోచారం, సంజ‌య్ కుమార్‌లు హ‌స్తం పార్టీలో జాయిన్ కాగా.. తాజాగా చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా ఆ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో నేడు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా క‌ప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన BRS ఎమ్మెల్యేలు వీరే..

దానం నాగేందర్ – ఖైరతాబాద్
కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్
తెల్లం వెంకట్రావు – భద్రాచలం
పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
డా.సంజయ్ కుమార్ – జగిత్యాల
కాలె యాదయ్య – చేవెళ్ల

Spread the love

Related News