ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య T20 World Cup-2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్ వేదికగా రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్లో 17ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సౌతాఫ్రికాపై గెలిచి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటివరకు ICC ట్రోఫీ నెగ్గని సౌతాఫ్రికా కూడా టైటిల్ గెలవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగనుంది.
T20WC: INDvsSA హెడ్ టు హెడ్ రికార్డులివే..
ఇవాళ T20WC ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ T20ల్లో ఇరు జట్లు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో IND 14, SA 11 సార్లు గెలవగా 1 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అలాగే WCల్లో 6 సార్లు తలపడగా టీమ్ ఇండియా 4, సౌతాఫ్రికా 2 సార్లు గెలుపొందాయి. ఏవిధంగా చూసుకున్నా ప్రొటీస్‌పై భారత్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఇవాళ ఆ జట్టుపై గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ చూస్తోంది.