Trending Now

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ ఇక‌లేరు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు.

షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2006-2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్తోపాటు బీజేపీలో చేరారు.

Spread the love

Related News

Latest News