ప్రతిపక్షం, తెలంగాణ: బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరే బీఆర్ఎస్ నేతల సంఖ్యల క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మరో నేత కారు దిగి హస్తం గూటికి చేరుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.