Trending Now

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వ పెన్షన్‌ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీ మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు.

మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పెనుమాకలో సోమవారం(జులై 1) వేకువజామునే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బానావత్‌ పాములునాయక్‌ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్‌ అందజేశారు. ఆపై లబ్ధిదారులు ఇస్లావత్‌ సాయి, బానవత్‌ సీతలకు స్వయంగా పెన్షన్‌ అందజేసి, వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్‌ కూడా ఉన్నారు.

Spread the love

Related News

Latest News