Trending Now

వరంగల్‌కు మరో మంత్రి పదవి..!

డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పేరు తెరపైకి

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 30: ఒకటి రెండు రోజుల్లో జరగనున్న కేబినెట్ విస్తరణలో వరంగల్ కు మరో అవకాశం దక్కనున్నట్లు వినికిడి.. రాష్ట్ర కేబినెట్లో మరో 6 గురికి అవకాశం కల్పించనున్న నేపథ్యంలోసామాజిక నేపథ్యం దృష్ట్యా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో మంత్రివర్గ విస్తరణ పై ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సైతం మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలపడంతో జూన్ రెండో తేదీన మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే భర్తి చేయనున్నఆరు మంత్రి పదవుల్లో సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అదే గనుక నిజమైతే రాష్ట్రం నుంచి లంబాడ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కాగా మరొకరు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మూడుసార్లు పోటీ చేసే ఓడిపోయిన రామచంద్రనాయక్ ఏఐసిసి స్థాయిలో లా బీయింగ్ జరుపుతున్నారు. కార్యక్రమంలో బాలు నాయక్ సైతం మంత్రి పదవి కోసం ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పార్టీలో చెరే క్రమంలోనే పిసిసి వర్గాలు హామీ ఇచ్చి నట్లు సమాచారం అదే నిజమై రాజగోపాల్ రెడ్డికి గనుక మంత్రి పదవి దక్కినట్లయితే నల్గొండ జిల్లాకు ఒకరికే అవకాశం ఉన్నందున దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు అవకాశం దక్కకపోవచ్చనేది ఓ పరిశీలన కాగా సామాజిక సమీకరణల రీత్యా లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మంత్రి పదవి దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వివరించనుందా..? రామచంద్రనాయక్ మంత్రి పదవిపై ఎలాంటి నిర్ణయం జరగనుందనేది తెలియాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందే..

Spread the love

Related News

Latest News