Trending Now

కొత్త బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్

ప్రతిపక్షం, షాద్​నగర్​: నిరుపేద ,సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యం రవాణా సదుపాయాన్ని కల్పించే ఆర్టీసీ బస్సులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్త ఉషస్సులను సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణం నుంచి వివిధ గ్రామాలకు నూతనంగా 9 బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక బస్ డిపోలో వాటర్ ప్లాంట్ ను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. దీనిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 17 బస్సులు డిపోలకు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ప్రస్తుతం 9 బస్సులు వచ్చాయని ఆయన వెల్లడించారు. డిజిల్ ఆటోలలో ప్రయాణం వల్ల ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలకు గురై ఇబ్బందుల పాలవుతున్నారని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణం చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది డిపోలో బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గది లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అదేవిధంగా ప్రయాణికులకు తగిన షెల్టర్లు లేకపోవడం వల్ల ఎండలో బస్సుల కోసం ఇబ్బంది పడవలసి వస్తుందని పాత్రికేయులు దృష్టికి తీసుకురాగా, రెండు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిత్యం పనుల మీద వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అదేవిధంగా చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని రూట్లలో బస్సులు నడిపేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

శంకరన్న రైట్..రైట్..

షాద్ నగర్ పరిధిలో వివిధ గ్రామాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయం ఎలా ఉందో పరిశీలించేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బస్సు ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టి సమస్యలపై అనేక విషయాలు మహిళల నుండి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఏలా ఉంటుందని వారీ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వారు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం తద్వారా సమాజం బాగుపడుతుందని వారితో ముచ్చటించారు. బస్సు ఎక్కిన ఆయన షాద్ నగర్, లింగారెడ్డిగూడెం, చంద్రయన్ గూడా, నందిగామ, విజయలక్ష్మి, కొత్తూరు, తీగాపూర్, ఫాతిమాపూర్, చేగూర్ గ్రామాల మీదుగా ఆయన ప్రయాణం చేశారు. ఎప్పటినుంచో బస్సు సదుపాయం కావాలని కోరుతున్న కన్హ భక్తుల కోసం కూడా ఆయన బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉషతోపాటు, స్థానిక నేతలు జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, అందే మోహన్ లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News