Trending Now

‘గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలను రద్దు చేయండి’

టీజీవీపీ డిమాండ్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 01 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో అవినీతి రాజ్యమేలుతుందని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అలాగే యూనిఫార్మ్స్ బుక్స్ బోట్లు టైలు పాఠశాలలోనే దుకాణాలు తెరిచి బహిరంగంగానే అమ్ముతున్నారని.. వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుండి పిండి వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ తతంగమంతా తెలిసినప్పటికీ కూడా ఉన్నత విద్యాధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలలకు తోక పేర్లు అనగా మెమోరియల్ టెక్నో కాన్సెప్ట్, ఈ టెక్నో పబ్లిక్ మోడల్ గ్లోబల్‌ యూనివర్సల్ లాంటి పేర్లు నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే అనేక పాఠశాలలో నడుస్తున్నాయని తెలిపారు. అలాగే మెజారిటీ పాఠశాలలో ప్రభుత్వాన్నిబంధనలు మేరకు నడవడం లేదు ఫీజులు మాత్రం వేలాదిగా వసూలు చేస్తున్నారని తెలిపారు. వెంటనే ఉన్నత విద్యాధికారులు స్పందించి అన్ని ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ కో కన్వీనర్ మిథున్ సాయి, పోశెట్టి, తరుణ్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News