ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ (53) చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళంలో కళాభవన్ మణి, ముఖేష్, రంభ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. పలు సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.