ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 02 : వామపక్షాల ఆధ్వర్యంలో భాగంగా 4 తేదీన బంద్ చేపడుతున్నట్లు నాయకులు పేర్కొ న్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం వారు మాట్లాడారు. వామపక్ష విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నీట్ సమస్యతో 24 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు చిక్కుల్లో పడిందనొ ఆవేదన చేందుతుంటే కనీసం దేశ ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. భారత దేశ ప్రజలు ప్రధానిగా మూడవ సారి ఎన్నుకుంటే కనీసం ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులపై కూడా అదే చిన్న చూపు చూడడం బాధాకరమని అన్నారు.
వైద్య విద్యలో ఇంత పెద్ద అవినీతి జరగడం దీనిలో అధికారుల పాత్ర కూడా ఉందని.. వారిపైన కఠిన మైన చర్యలు తీసుకోవాలి. సీబీఐ తో విచారణ జరిపించడం కాదని దానిపైన ప్రజలకు, విద్యార్థులకు పూర్తిగా నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు పరిధిలో నీట్ పరీక్ష అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ విద్యార్థులపై స్పందించకపోవడం ఏమాత్రం కూడా విద్యార్థులు సహించబోరని, పదోవ తరగతి ప్రశ్నపత్రం లికేజ్‌లో జరిగినపుడు బండి సంజయ్ విద్యార్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం దేశం మొత్తం నీట్ సమస్య వినపడ్తున్న ఏమాత్రం కూడా సోయిలేనట్టు వ్యవహరిస్తున్న బండి సంజయ్ కి తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెప్తారు. ఎక్కడికి అక్కడ బండి సంజయ్ నీ అడ్డుకుంటామని వామపక్ష విద్యార్ధి సంఘాలు ప్రెస్ మీట్ లో తెలిపారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా మళ్లీ నిర్వహణ చేయాలని అన్నారు. ఎన్టీ వీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా లీకేజీ నిరసనపై ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తున్నామని యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఎఐ ఎస్ ఎఫ్ నిర్మల్ జిల్లా కన్వీనర్ కైలాష్, ,నాయకులు ప్రవీణ్, ఎస్ ఎఫ్ ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డిగంబర్, పీడీఎస్ యు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.