ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే అయినా సొంత కారు లేని వ్యక్తికి పార్టీ కార్యకర్తలే విలువైన కారును గిఫ్టుగా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే అంతకుముందు వరకు సాధారణ కార్యకర్త మాత్రమే అయిన బాలరాజుకు సొంత కారు లేదని సమాచారం.ఈ నేపథ్యంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎమ్మెల్యే బాలరాజుకు విలువైన ఫార్చ్యూనర్ కారును గిఫ్టుగా అందజేశారు.