ప్రతిపక్షం, వెబ్డెస్క్: విభజన హామీలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించుకోవాలని TJS అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. చర్చలు జరిపితేనే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ‘గతంలో కేసీఆర్, జగన్ రాజకీయ అవసరాల కోసమే సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వారు ఏనాడూ చర్చించలేదు. అందుకే గత ప్రభుత్వ హయాంలో విభజన సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా రేవంత్, చంద్రబాబు దీనిపై దృష్టి సారించాలి’ అని ఆయన పేర్కొన్నారు.



























