ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ‘నీట్’ పేపర్ లీక్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరుతూ ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. ’24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వారి ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించడమే మా లక్ష్యం. ఈ చర్చకు మీరు నాయకత్వం వహిస్తే అది సముచితంగా ఉంటుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రసంగంపై అభ్యంతరాలు.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో కేంద్రంపై రాహుల్ గాంధీ చేసి విమర్శలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకున్నారు. హిందూ మతం, బీజేపీ, RSS, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కాగా నిన్న దాదాపు 100 నిమిషాలపాటు రాహుల్ ప్రసంగించిన విషయం తెలిసిందే.