Trending Now

వారు ఇక ముందు కూడా ఆడతారు


రోహిత్, కోహ్లీపై జైషా వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పాకిస్తాన్ వేదికగా 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ, లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లోనూ కోహ్లీ, రోహిత్‌ పాల్గొంటారని వెల్లడించారు. అందుకు అనుగుణంగా టీమిండియా కసరత్తు చేస్తోందని చెప్పారు. శ్రీలంకతో సిరీస్‌ నుంచి టీమిండియాకు కొత్త కోచ్ వస్తారని కూడా జైషా వివరించారు. జింబాబ్వే సిరీస్ కు లెజెండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలక్టర్‌గా ఉంటాడన్నారు. క్రికెట్ సలహామండలి సూచన మేరకు కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సెలక్టర్ల నియామకం మీద దృష్టి సారించామన్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారన్నారు. తీసుకుంటారని జై షా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‍బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు, వన్డే ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ ట్రోఫీలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. టీమిండియాకు కోచ్ గా వచ్చేవారు జట్టను సమర్థవంతంగా ముందుకు నడిపించేవారై ఉంటారని జైషా వివరించారు.

Spread the love

Related News

Latest News