ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశ అభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకెళ్తామని రాజ్యసభలో పీఎం మోదీ తెలిపారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరలు భారీగా పెంచామని చెప్పారు. అన్నదాతల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, పీఎం కిసాన్ ద్వారా ఆరేళ్లలో రూ.3లక్షల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. గతంలో సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తేలేదని పీఎం విమర్శించారు.