Saripodhaa Sanivaaram Promotional Song: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు.
‘సరిమప’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో నాని, ప్రియాంక అదిరిపోయే స్టెప్పులతో మైమరిపించారు. మంచి క్లాస్ మెలోడీగా సాగే ఈ సాంగ్‌కు జేక్స్ బిజోయ్ రాకింగ్ మ్యూజిక్ అందించగా..సనారె రచన, కార్తిక్ పాడారు. కాగా, ఈ మూవీని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా..ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ‘అంటూ సుందరానికి’ మూవీ తర్వాత నాని, వివేక్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచాలు నెలకొన్నాయి. ఇక, ఈ మూవీ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.