Amit Shah said Will free India from Naxal violence: దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్ట్ తీవ్రవాదులపై చివరి దాడికి సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన నక్సలిజం కారణంగా దేశంలో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
2004 -14 పదేళ్లతో పోల్చితే..2014-24 నాటికి దేశంలో నక్సలిజం ఘటనలు సగానికి తగ్గాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 53శాతం తగ్గుదల నమోదైందని అమిత్ షా వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సమస్య అని భావిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టుల ఆర్థిక నెట్ వర్క్‌ను దెబ్బ తీసేందుకు ఎన్ఐఏ, ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయ పరుస్తున్నామన్నారు.