Hydra Support Walk: చెరువుల పరిరక్షణకు హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా ఆదివారం గండిపేట చెరువుకట్టపై ‘హైడ్రా సపోర్టు వాక్’ నిర్వహిస్తున్నట్లు గండిపేట వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వేణుగోపాల్, ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరువులను కాపాడాలనే ప్రధాన లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి గండిపేట పరిసరాల్లోని ఆయా కాలనీల నివాసులు కుటుంబ సమేతంగా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై పెద్దఎత్తున ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి.
కాగా, చెరువుల సమీపంలో కొంత భూమి ఉంటే..కొంతమంది ఆ భూమిన కలిపేసుకోవడం..చెరువులో మట్టిని పూడ్చి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి పరిధిలో దాదాపు 80శాతం చెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రా పేర్కొంది. ఉప్పల్, కాప్రా, మూసాపేట, సరూర్ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లోని చెరువుల్లో వందల నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు అందాయి.