Trending Now

Manu Bhakar: ఆ ముగ్గురు క్రికెటర్లంటే ఎంతో ఇష్టం.. ఒలింపిక్ విన్నర్ మను బాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన మను బాకర్ గురించి ప్రస్తుతం దేశంలో తెలినీ వారు ఎవరూ ఉండరు. ఒలింపిక్స్‌లో డబుల్ మెడల్స్ సాధించి భారత్ సత్తా ఏపాటిదో చాటింరామె. ఒలింపిక్స్ గడిచి రెండు వారాలు పూర్తయినా ఎన్నో మీడియా సంస్థలు, ఛానళ్లు ఆమె ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మను బాకర్ తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

క్రికెట్‌లో తనకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్ల పేర్లను వెల్లడించారు. వారితో మాట్లాడుతూ సమయం గడిపితే బాగుంటుందని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్, ధోనీ, విరాట్ కోహ్లీ.. ఆ లిస్ట్‌లో ఉంటారని తెలిపారు. అలాగే జమైకా స్టార్‌ రన్నర్ ఉసేన్ బోల్ట్ కూడా తన ఫేవరెట్ అని, ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా చదివానని అన్నారు. బోల్ట్ ప్రయాణం ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.

Spread the love

Related News

Latest News