Buddy: ఓటీటీలోకి రానున్న అల్లు శిరీష్ సరికొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా నటించిన చిత్రం ‘బడ్డీ’. గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్‌ హీరోయిన్. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు తొలి వారంలో థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని థియేటర్లలో చూడలేకపోయిన అల్లు శిరీష్ ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. వీరికి తాజాగా గుడ్ న్యూస్ అందింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 30 నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో శిరీష్, గాయత్రీ భరద్వాజ్‌లతో పాటు అజ్మల్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషించారు.

Spread the love

Related News