తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. అంతేకాదు, పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. కాగా.. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 4.4 సెంటీ మీటర్లు, వరంగల్ జిల్లాలోని సంగెం, కరీంనగర్ జిల్లాలోని సంగెంలో 4.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే.