మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్ పెడ్లర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో అయితే మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోయినట్లు నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా నగరంలోని బోయిన్‌పల్లి పరిధిలో పోలీసులు 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇక, ఈ డ్రగ్‌ను నేరుగా పీల్చవచ్చని, లేదా కూల్ డ్రింక్‌లో కలుపుకుని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. నిందితులు అమ్మాయిలకు ఈ డ్రగ్‌ను కూల్ డ్రింక్‌లో కలిపి ఇచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సంగారెడ్డికి చెందిన కుంచల నాగరాజుతో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.