Trending Now

Pakistan: బస్సులు ఆపి ఉగ్రవాదులు కాల్పులు.. 33 మంది మృతి

Gunmen kill 33 passengers in Pakistan: పాకిస్థాన్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కొంతమంది ఉగ్రవాదులు రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు నిలిపి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 33 మంది మృతి చెందారు. బలూచిస్థాన్ జాతీయ రహదారిపై వెళ్లే బస్సులు, ట్రక్కులను ఉగ్రవాదులు ఆపివేశారు. ప్రయాణికులు బస్సు దిగిన తర్వాత వెంటనే కాల్పులు జరిపారు. ఈ దాడిలో 33 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.

ముసాఖెల్ జిల్లా రరాషమ్‌లో జరిగిన ఈ ఘటనలో 10 వాహనాలకు నిప్పు పెట్టారు. మృతుల్లో పంజాబీలు, బలూచీలు ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లో ప్రయాణికులే లక్ష్యంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బలూచిస్థాన్ సీఎం సర్పరాజ్ స్పందించారు. ఈ దాడిపై తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love

Related News

Latest News