Trending Now

NTR: ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్..!

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం ‘దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సాధారణ ప్రేక్షకులు సైతం దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘చుట్టమల్లె చుట్టేస్తాందె’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే, దేవర్‌ ఫస్ట్‌ షో గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌.. ఓవర్సీస్‌లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈ మేరకు UKలో ఇప్పటికే ‘దేవర’ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

ఇక, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ ఇందులో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.

Spread the love

Related News

Latest News