ప్రతిపక్షం, తెలంగాణ: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయింది. ఈనెల 23న వనపర్తి-కొత్తకోటలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఫిర్యాదు అందింది. దీంతో కొత్తకోట పోలీసు స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.