ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ MLA కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్లో కేసు నమోదైంది. ఇటీవల అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు. దీంతో ఆయన పోలీసుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని నగరానికి చెందిన ఆశిశ్గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.