Trending Now

సినీనటి నవనీత్ కౌర్‌పై కేసు నమోదు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎలక్షన్ కమీషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని డీకే అరుణ తరఫున రోడ్డు షో నిర్వహించిన నవనీత్ కౌర్ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లైయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్డు షో అనుమతి తీసుకున్న బాధ్యులతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా ధృవీకరించారు.

Spread the love

Related News

Latest News