Trending Now

తైక్వాండో ఛాంపియన్షిప్‌లో నిర్మల్ విద్యార్థికి మోడల్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27: నిర్మల్ పట్టణంలోని ఈద్గాం కాలనీకి చెందిన ద్యాయత్ అక్షయ్ కుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఓపెన్ తైక్వాండో చాంపియన్ షిప్ 30 సంవత్సరాల వయస్సు లోపు కేటగిరిలో తృతీయ స్థానంలో మోడల్ సాధించారు. మహేశ్వర్ ఒలంపిక్ రాష్ట్ర ట్రెసరార్, రాష్ట్ర తైక్వాండో సెక్రటరీ చేతుల మీదుగా మెడల్ బహుకరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, పలువురు అభినందించారు. తన గురువు మాస్టర్ నాగరాజు తనకు ఎంతో ప్రోత్సాహం అందించి,తోడుగా నిలిచారని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్ముందు మరింత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి, జిల్లాకి మంచి పేరు తెస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News