ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత చేరనుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున 200 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఇవాళ SRHతో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(239-RCB), ధోనీ(222-CSK) మాత్రమే ఒకే జట్టు తరఫున 200కు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు.