ప్రతిపక్షం, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు.
రోహిత్ క్రికెటింగ్ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు.