Congress MLA Aadi Srinivas Counter to Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావుది చిట్ చాట్ కాదు..సోది చాట్ అని విమర్శలు చేశారు. రాష్ట్రంలో చీప్ పాలిటిక్స్‌కు హరీష్ రావు తెరలేపారని, అక్రమ కట్టడాలు కూల్చివేస్తే బీఆర్ఎస్ నేతలకు ఏం నష్టం జరుగుతుందన్నారు.
రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి రైతుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. సెలబ్రెటీలు చెరువులను కబ్జా చేస్తే హరీష్ రావు స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. హైడ్రా నిబంధనల మేరకే నడుస్తోందని ఆది శ్రీనివాస్ అన్నారు. అనవసరంగా అవాక్కులు, చెవాక్కులు మానేసి ప్రజాపాలనకు సహకరించాలన్నారు. కాగా, అంతకుముందు హరీష్ రావు..సీఎం రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదని, చీప్ చాట్ అని ఎద్దేవా చేశారు.



























