ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్
ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు ను నిరసిస్తూ.. మార్చ్ 31న చలో ఢిల్లీ కార్యక్రమం రాం లీలా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని.. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన పేద ప్రజలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యా, వైద్యం అందించడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి దేశంలో ముందు వరుసలు ఉన్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పోలిస్తే అరవింద్ క్రేజీవాల్ పరిపాలన బాగుందని గౌరవంగా చెప్పుకోవచ్చన్నారు. లేనిపోని కేసులను బనాయించి ఎలాగైనా ఎన్నికలలో ప్రచారాన్ని అడ్డుకోవాలని బీజేపీ భావిస్తుందని ఆయన ఆరోపించారు.