ప్రతిపక్షం, హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో జమ్మికుంట తహశీల్దార్ రజిని ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేస్తోంది. అదే విధంగా హనుమకొండలో కేఎల్ ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న తహసీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో అధికారులు ఏమైనా నగదు స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తహసీల్దార్ రజినీపై గతంలోనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి.