Trending Now

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్దం.. భారీగా ఆస్తి నష్టం

సుమారు 8 లక్షల ఆస్తి నష్టం..

ప్రభుత్వం ఆదుకోవాలని బాదితురాలు వేడుకోలు..

ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు ఇల్లు దగ్దమైన సంఘటన శనివారం అర్ధరాత్రి దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన మంగిలి పల్లి ఎల్లవ్వ(61) భర్త బాలయ్య ఇంటి. నెం .1-46/1. కు చెందిన ఇల్లు శనివారం తన కూతురు అత్త గారిల్లు ఊరు అయిన బిబిపేట మండలం కాచాపూర్ గ్రామానికి ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీంతో అర్ధరాత్రి ఇంటిలో నుండి మంటలు చెలరేగడంతో చుట్టూ ప్రక్కల వాళ్లు అది చూసి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటలు తగ్గక పోవడంతో దుబ్బాక పట్టణంలో గల అగ్ని మాపక కేంద్రానికి ఫోన్ చేయగా.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇల్లు చాలా వరకు దగ్దం అయినట్లు స్థానికులు వివరించారు. కూలి పనులు చేస్తూ బ్రతుకుతున్న ఎల్ల వ్వ ఇల్లు పూర్తిగా దగ్దం అవ్వటం వల్ల సుమారు ఎనిమిది లక్షల ఆస్తి నష్టం తో పాటు, ఇంటిలో వున్న 25 వేల రూపాయల నగదుతో పాటు ,ఇంటిలో సామాను పూర్తిగా మంటల్లో ఖాళీ పోయి బూడిద అయినట్లు తెలిపారు. ఇల్లు పూర్తిగా దగ్దమై తీవ్రంగా నష్టపోయిన బాధితురాలు ఎల్ల వ్వ కుటుంబాన్ని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News