ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మావోయిస్టులతో సంబంధాల కేసులో పదేండ్ల క్రితం అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఈ రోజు రిలీజ్ అయ్యారు. ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సాయిబాబాపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు చూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తెలిపింది. 54 ఏండ్ల సాయిబాబాకు విధించిన జీవిత ఖైదును కూడా కోర్టు పక్కన పెట్టింది. సాయిబాబాతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎన్‌ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. శారీరక వైకల్యం వల్ల వీల్‌చైర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా 2014లో ఈ కేసులో అరెస్టయ్యారు. అప్పటి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు.