ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు పరిచయమైన నటి ముంతాజ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. తనకు ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి సోకినట్లు చెప్పారు. ఈ వ్యాధితో ఎముకల జాయింట్స్‌లో భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు. తన అన్నయ్య మద్దతు లేకుంటే ఇప్పటికే ఆత్మహత్య చేసుకునేదాన్నని చెప్పారు. 43 ఏళ్ల తనకు ఇకపై వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.