Trending Now

ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : ధాన్యం కొనుగోళ్ళను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులకు తలేత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, వర్షాల వలన ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్ లు, గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతుల వారీగా కొనుగోళ్లు, సాగు విస్తీర్ణం, ధాన్యం వివరాలను నిర్వాహకులు ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ చేయాలనీ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం కేంద్రాల వారీగా ఇప్పటివరకు కొనుగోళ్లు, ట్యాబ్ ఎంట్రీ తదితర అంశాల పై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ భుజంగ్ రావు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్ వో శ్రీకళ, డీసీఓ నర్సయ్య, ఏడీ మార్కెటింగ్ అశ్వాక్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News