ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ నేటితో ముగిసింది. దీంతో వీళ్లిద్దరికి గాంధీ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా నాంపల్లి కోర్టు భుజంగరావు, తిరుపతన్నకు ఈనెల 6 వరకు కస్టడీని పొడిగించింది. దీంతో కాసేపట్లో వీరిద్దరిని చంచల్ గూడా జైలుకు తరలించనున్నారు.