Trending Now

‘నిన్నటి టీచర్, ఇవాళ ఎంపీ అభ్యర్థి’..

అదిలాబాద్ -కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నేపథ్యం ఇదే..

ప్రతిపక్షం నిర్మల్ ప్రతినిధి మార్చి 29: అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆత్రం సుగుణ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఈమె మరో 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఈ యేడు మార్చి 12న తన ఉపాధ్యాయ పదవికి రాజీనామా సమర్పించుకున్నారు. టీచర్ కాకముందు ఎంపీటీసీగా కూడా పనిచేశారు. ఆత్రం సుగుణ భర్త ఆత్రం భుజంగ్ కూడా ఉపాధ్యాయుడే. ఈమె తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు ఆదివాసి, ఉపాధ్యాయ ఉద్యమాలలో కీలకంగా వ్యవహారించి తనదైన పేరును సంపాదించుకున్నారు.

రాష్ట్ర మంత్రి సీతక్కతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈమెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కడానికి కలిసి వచ్చిందంటున్నారు. ఈమె గోండ్ తెగకు చెందినది. ప్రస్తుతం ఆత్రం సుగుణ ఆదివాసి ఉమెన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర సెక్రటరీగా, టి పి టి ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఆదిలాబాద్ జిల్లా మానవ హక్కుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా, ఆదివాసి, కల్చరల్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మహిళా విభాగపు కార్యదర్శిగా, అరుణోదయ కల్చరల్ ఫౌండేషన్ ఆదిలాబాద్ జిల్లా కో- కన్వీనర్ గా, ఇందిరా ఫిల్లోషిప్ ఆదిలాబాద్ జిల్లా గౌరవ సభ్యురాలుగా పదవులలో తన సేవలను అందిస్తున్నారు.2017 లో కొమురం భీమ్ త్యాగ సేవా పురస్కారం, 2018 లో జ్యోతిబాపూలే సేవా పురస్కారాలను ఆత్రం సుగుణ పొందారు.

Spread the love

Related News

Latest News