అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ మహోత్సవానికి అశేషంగా తరలివచ్చిన జనవాహిని..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 2 4 : అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ మహోత్సవానికి పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుండి అశేష జనం తరలివచ్చి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో రాంలీల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ కూడలి మీదుగా కొమురంభీం కూడలి వరకు కొనసాగింది.. ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న అదిలాబాద్ ఎమ్మెల్యే, పార్లమెంట్ ఇంచార్జ్ పాయల శంకర్, బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారవ్ పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపం నాలుగు నెలల్లోనే బయటపడిందని,ఇటీవల అదిలాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలలో ఓడిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి హోదాలో దిగజారి మాట్లాడుతున్నారని, అదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని, గోడం నగేష్ రూ. 2 లక్షల మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
భారీ ర్యాలీకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో సమర్థవంతమైన, పటిష్ఠమైన ప్రభుత్వం కొనసాగిందని దేశ భవిష్యత్తు కొరకు మళ్లీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.. పార్లమెంట్ నియోజకవర్గంలో మరికొన్ని సమస్యలు పరిష్కారం కావల్సి ఉన్నాయని, ఆ సమస్యలను సమూలంగా పరిష్కారించుకోవడానికి మీ ప్రతినిధి గా పార్లమెంట్ కు పంపించాలని కోరారు.. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్రమోదీ గారి నాయకత్వాన్ని బలపరిచాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, పార్లమెంట్ ప్రభారి అల్జాపూర్ శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, మూడు జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.