ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : ఇచ్చోడ మండలం బోజ్జుగూడ గ్రామంలో అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అందించిన సుపరిపాలనను వివరించారు. ఒక్క అవినీతి మచ్చ లేకుండా పది సంవత్సరాల పాటు పాలించిన బీజేపీ పార్టీను మళ్లీ ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. 500 ఏళ్ల హిందువుల చిరకాల స్వప్నం.. రామ మందిరం నిర్మాణాన్నికూడా మోడీ ప్రభుత్వమే చేపట్టిందని మోడీ చే ప్రాణ ప్రతిష్ట చేయించి రామాలయానికి కొత్త శోభను తీసుకురావడం జరిగిందని చెప్పారు. కేంద్రంలో వచ్చేది మల్ల రామరాజ్యమైన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
మోడీ ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం, సమ సంక్షేమం ఉంటుందని చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలే ఏలుతున్నాయని ఈ దిశగా మనం ప్రయత్నిస్తే కూడా మన రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాక తప్పదని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.