అదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి), ఏప్రిల్ 6: రైతన్నలను మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విమర్శించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఆర్డివో కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పాలనలో పచ్చగా ఉన్న తెలంగాణలో వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారి తెలంగాణ చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, రాంకిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డాక్టర్ సుభాష్ రావు, లక్కాకుల నరహరి, మున్సిపల్ కౌన్సిలర్ పుదరి రాజేశ్వర్, నాయకులు మహమ్మద్ నజీరుద్దీన్, గండ్రత్ రమేష్ తదితరులున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థిగా ప్రకటన అయిన తర్వాత నిర్మల్కు తొలిసారిగా విచ్చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు.