పోలింగ్ బూత్ వద్ద నిలదీసి.. గొడవకు దిగిన మహిళ ఓటర్లు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 271లో స్థానిక శాసనసభ్యులు సోమవారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల కాసేపు ఘర్షణ జరిగింది. ఎన్నికల ప్రవర్తన నియమవాళి ప్రకారం.. 100 మీటర్ల కంటే లోపు ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారస్త్రాలు ఆ మాదిరి ఉన్న వాటిని వాడకూడదని ఉంది. అయితే అదిలాబాద్ శాసనసభ్యులు ఆయన అనుచరులు పోలింగ్ స్టేషన్ నెంబర్ 271లో నేరుగా భారతీయ జనతా పార్టీ కండువాల మాదిరే ఉన్న అదే రంగులో ఉన్న కండువాలు వేసుకొని రావడంతో మహిళలు ఒకేసారి వారిపై తిరగబడ్డారు.
పోలీసులతో సహితం వాదనకు దిగారు. కాషాయం రంగులో ఉన్న కండు వాలు వేసుకొని పోలింగ్ స్టేషన్ లోకి ఎలా వచ్చారంటూ ఘర్షణకు దిగి ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ లోనే ఎందుకు సంచరిస్తున్నారని నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది, పోలీసులు జోక్యం చేసుకొని వారిని పోలింగ్ స్టేషన్ నుండి చాలా దూరం వరకు పంపారు.