అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : భారతీయ జనతా పార్టీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మంగళవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల మోడీ ప్రభుత్వ పాలన, సుస్థిరమైన సంక్షేమ పథకాలు, అవినీతి రహిత కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మూడోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే దేశానికి సుభిక్షమైన పాలన అందుతుందని చెప్పారు. ఆయన వెంట అదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ పెద్దపల్లి ఇన్చార్జ్ రావుల రాం నాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి, గణపత్ రెడ్డి, మల్లేష్, విజయ్ కుమార్ రెడ్డి, సదానంద్, రాములు లతో పాటు పలువురు పాల్గొన్నారు.