ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్‌పై 55వేలకు పైగా మెజారిటీతో వాసు విజయదుందుభి మోగించారు. అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 50వేలకు పైగా మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించింది. 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.