ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ సూపర్-8కు దూసుకెళ్లింది. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరి సూపర్-8లో అడుగుపెట్టింది. 96 పరుగుల టార్గెట్‌ను అఫ్గాన్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గుల్బదిన్ నాయబ్ (49) రాణించారు. అంతకుముందు ఫజల్లా ఫారూఖీ 3, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లతో చెలరేగడంతో పపువా న్యూగినియా 95 పరుగులకే కుప్పకూలింది.
అదరగొడుతున్న అఫ్గాన్ బౌలర్లు..
టీ20 WCలో అఫ్గానిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లను 100 పరుగుల్లోపే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఉగాండా 58, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఫారూఖీ 3 మ్యాచుల్లో 12 వికెట్లతో టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నారు. రషీద్‌ఖాన్ 6 వికెట్లు పడగొట్టారు.