Agniveer: ఇవాళ్టి నుంచి విశాఖలో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

విశాఖ పోర్టు స్టేడియంలో ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 5 వరకు ‘అగ్నివీర్’ ర్యాలీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యువత ఇందులో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్‌ ట్రేడ్‌ మ్యాన్‌ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

అయితే, ముందుగా రిజిస్టర్‌ చేసుకొని అడ్మిట్‌ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టంచేశారు. అడ్మిట్‌ కార్డుల కోసం ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రతి ఒక్క ధృవపత్రంతో అభ్యర్థులు హాజరవ్వాలని సూచించారు. ఈ ర్యాలీలో ప్రతి రోజూ 500 నుంచి 800 మంది యువకులు పాల్గొనే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.

Spread the love

Related News